నిజామాబాద్ బోధనలో కాంగ్రెస్ వ్యతిరేక పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. రాహుల్ గాంధీ బోధన్ పర్యటనను నిరసిస్తూ పలుచోట్ల పోస్టర్లు వెలిశాయి.

Posters Against Congress in Nizamabad and Bodhan
నిజామాబాద్(Nizamabad), బోధన్(Bodhan)లో కాంగ్రెస్ వ్యతిరేక పోస్టర్లు(Posters Against Congress) కలకలం సృష్టిస్తున్నాయి. రాహుల్ గాంధీ బోధన్ పర్యటనను నిరసిస్తూ పలుచోట్ల పోస్టర్లు వెలిశాయి. రాత్రికి రాత్రే రాహుల్ గాంధీ(Rahul Gandhi), రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఫోటోలతో బీఆర్ఎస్ శ్రేణులు పోస్టర్లు ఏర్పాటు చేశారు.
బలిదానాలకు బాధ్యత మీదే.. మా బిడ్డలను చంపింది మీరే, క్షమాపణలు చెప్పాల్సిందే.. ముక్కు నేలకు రాయాల్సిందే, కర్నాటకలో కరెంటు కష్టాలు.. ఉద్యోగాలు కాదు.. ఉరితాళ్లే.. కాంగ్రెస్‌కు ఓటేసిన పాపానికి నిరుద్యోగుల గోస.. తెలంగాణ(Telangana)మా తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తూ రాహుల్ రాక సందర్భంగా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోస్టర్లు ఏర్పాటుచేశారు.
పోస్టర్లపై కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్(Congress) గెలుస్తుందని.. బీఆర్ఎస్(BRS)కు ఓటమి భయం పట్టుకుందని అంటున్నారు.
