కరీంనగర్ జిల్లాలో(Karimnagar District) షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంటర్ మొదటి సంవత్సరం(inter 1st year student) చదువుతున్న ఓ విద్యార్థిని కాలేజీలో జరిగిన ఓ వేడుకలో డ్యాన్స్(Dance) చేస్తూ అకస్మాత్తుగా గుండెపోటుతో(Heart attact) కుప్పకూలిపోయింది.

Inter student Died With Heart stroke
కరీంనగర్ జిల్లాలో(Karimnagar District) షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంటర్ మొదటి సంవత్సరం(inter 1st year student) చదువుతున్న ఓ విద్యార్థిని కాలేజీలో జరిగిన ఓ వేడుకలో డ్యాన్స్(Dance) చేస్తూ అకస్మాత్తుగా గుండెపోటుతో(Heart attact) కుప్పకూలిపోయింది. వివరాళ్లోకెళితే.. కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలం వెంకటాయపల్లికి చెందిన గుండు అంజయ్య, శారదల కుమార్తె ప్రదీప్తి(Pradeepthi). ఆదర్శ పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది.
శుక్రవారం ఫ్రెషర్స్ డే సందర్భంగా ప్రదీప్తి డాన్స్ చేస్తుండగా.. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఒక్కసారిగా కుప్ప కూలిపడిపోయింది. వెంటనే ఉపాధ్యా యులు ఆమెకు సీపీఆర్ చేసి చికిత్స నిమిత్తం గంగాధర హాస్పిటల్‌కు తరలించారు. వైద్యులు పరీక్షించి ప్రదీప్తి పరిస్థితి విషమించడంతో కరీంనగర్ హాస్పిటల్ కు తీసుకువెళ్లాలని సూచించారు. తల్లిదండ్రులు ప్రదీప్తిని కరీంనగర్ హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. ఈ ఘటనతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
