త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి జిష్ణు దేవ్ వర్మ తెలంగాణ గవర్నర్‌గా

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొమ్మిది రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను, పుదుచ్చేరిలో కొత్త లెఫ్టినెంట్ గవర్నర్‌ను నియమించారు. మహారాష్ట్ర అసెంబ్లీ మాజీ స్పీకర్ హరిభౌ కిసన్‌రావ్ బాగ్డే రాజస్థాన్ గవర్నర్‌గా, త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి జిష్ణు దేవ్ వర్మ తెలంగాణ గవర్నర్‌గా నియమితులయ్యారు. సిక్కిం గవర్నర్‌గా రాజ్యసభ మాజీ ఎంపీ ఓం ప్రకాష్ మాథుర్‌ను రాష్ట్రపతి నియమించారు.

కేంద్ర మాజీ మంత్రి సంతోష్‌కుమార్ గంగ్వార్‌ను జార్ఖండ్‌ గవర్నర్‌గా నియమించగా, అస్సాంకు చెందిన మాజీ లోక్‌సభ ఎంపీ రామెన్‌ దేకా ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌గా నియమితులయ్యారు. కర్ణాటక మాజీ మంత్రి సి.హెచ్. విజయశంకర్‌ మేఘాలయ గవర్నర్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం జార్ఖండ్‌ గవర్నర్‌గా ఉన్న సి.పి. రాధాకృష్ణన్‌ మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులయ్యారు. అస్సాం గవర్నర్ గులాబ్ చంద్ కటారియా పంజాబ్ గవర్నర్‌గానూ.. కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్‌గా నియమితులయ్యారు. అదేవిధంగా, సిక్కిం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యను అస్సాం గవర్నర్‌గా నియమించారు, ఆయనకు మణిపూర్ గవర్నర్‌గా కూడా అదనపు బాధ్యతలు అప్పగించారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా మాజీ ఐఏఎస్ అధికారి కె. కైలాష్నాథన్ నియమితులయ్యారు.


Updated On
Eha Tv

Eha Tv

Next Story