పెద్దపల్లి జిల్లా మంథని(Mnthani) పరిధిలోని రామగిరి మండలం(Ramagiri mandal)కు చెందిన జర్నలిస్ట్(Journalist) పొన్నం శ్రీకాంత్ గౌడ్(PonnamSrikanth Goud).. పెద్దపల్లి సమీపంలో రైలు క్రిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన ఆత్మహత్యకు గల కారణాలను వివరిస్తూ శ్రీకాంత్ గౌడ్.. రామగిరి ఎస్సై(Ramagiri SI)కు వాట్సాప్‌లో మెసేజ్ పంపించి ఆత్మహత్యకు చేసుకున్నాడు. పొన్నం శ్రీకాంత్.. రామగిరి మండల కేంద్రంలో ప్రముఖ దినపత్రిక జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా వృత్తిలో కొందరు వ్యక్తులు అడ్డు తగులుతున్నారని శ్రీకాంత్ మానసిక వేదనతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

Journalist Poonam Srikanth Goud suicide
పెద్దపల్లి జిల్లా(Peddapalli District) మంథని(Mnthani) పరిధిలోని రామగిరి మండలం(Ramagiri mandal)కు చెందిన జర్నలిస్ట్(Journalist) పొన్నం శ్రీకాంత్ గౌడ్(PonnamSrikanth Goud).. పెద్దపల్లి సమీపంలో రైలు క్రిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన ఆత్మహత్యకు గల కారణాలను వివరిస్తూ శ్రీకాంత్ గౌడ్.. రామగిరి ఎస్సై(Ramagiri SI)కు వాట్సాప్‌లో మెసేజ్ పంపించి ఆత్మహత్యకు చేసుకున్నాడు. పొన్నం శ్రీకాంత్.. రామగిరి మండల కేంద్రంలో ప్రముఖ దినపత్రిక జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా వృత్తిలో కొందరు వ్యక్తులు అడ్డు తగులుతున్నారని శ్రీకాంత్ మానసిక వేదనతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. తన చావుకు కారణమైన నలుగురు వ్యక్తులను శిక్షించాలని కోరుతూ వారి పేర్లను సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. పెద్దపల్లి అండర్ రైల్వే బ్రిడ్జి వద్ద ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్న శ్రీకాంత్ శరీర బాగాలు ముక్కలు ముక్కలుగా విడిపోయి ట్రాక్‌పై పడి ఉన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.


