✕
హైదరాబాద్‌లోని కొత్తగా నిర్మించిన చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.

x
హైదరాబాద్(Hyderabad)లోని కొత్తగా నిర్మించిన చర్లపల్లి రైల్వే స్టేషన్ (Cherlapalli Railway)వద్ద ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన వర్షం వల్ల ప్రధాన ముఖ ద్వారం పైకప్పు భాగాలు ఒక్కసారిగా ఊడిపోయాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. రైల్వే పోలీసులు, స్టేషన్ సిబ్బంది ప్రయాణికులను అప్రమత్తం చేశారు. అటువైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. పరిస్థితిని సమీక్షిస్తున్నామని వెల్లడించారు.

ehatv
Next Story