సంధ్య థియేటర్ ఘటన కేసులో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పుష్ప-2 విడుదల సందర్భంగా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది.

సంధ్య థియేటర్ ఘటన కేసులో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పుష్ప-2 విడుదల సందర్భంగా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది.
ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. దీంతో హీరో అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్‌లో విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే సంధ్య థియేటర్ యాజమాన్యం ఈనెల 2వ తేదీన హైదరాబాద్ సీపీకి ఓ లేఖ రాసింది. అల్లు అర్జున్, రష్మిక, ఇతర వీఐపీలు వస్తున్నారని తగిన బందోబస్తు కల్పించాలని ఆ లేఖలో ఉంది.
ముందస్తు సమాచారం లేకుండా థియేటర్ కు వచ్చారంటూ అల్లు అర్జున్‌పై కేసును పోలీసులు నమోదు చేయడంతో ఆయన ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ముమ్మాటికీ పోలీసుల వైఫల్యమేనంటూ అల్లు అర్జున్ అభిమానులు వాదిస్తున్నారు. మీ తప్పిదానికి అల్లు అర్జున్‌పై కేసు పెడతారా అని ఆగ్రహం చెందుతున్నారు.
