✕
ఓ సర్పంచ్ ప్రమాణస్వీకారంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది.

x
ఓ సర్పంచ్ ప్రమాణస్వీకారంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. సర్పంచ్ ప్రమాణస్వీకారంలో విచిత్ర పరిస్థితి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచలో పోటీ చేసిన వారిలో ఇద్దరు గెలిచినట్లుగా ధ్రువీకరణ పత్రాలు అధికారులు ఇచ్చారు. దీంతో ప్రమాణ స్వీకారానికి ఇద్దరు అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకున్నారు. మొదటగా బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి స్వాతి 3 ఓట్ల తేడాతో గెలిచినట్లు ప్రకటించి ధ్రువీకరణ పత్రం అందజేశారు. అరగంట తర్వాత కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి సుజాతను ఒక్క ఓటు తేడాతో విజయం సాధించినట్లు మరోసారి ప్రకటించి ధ్రువీకరణ పత్రాన్ని ఆర్వో అందజేశారు. దీంతో ప్రమాణ స్వీకారానికి బంధువులను ఆహ్వానించిన ఇద్దరు అభ్యర్థులు. ఇద్దరు ప్రమాణస్వీకారానికి రావడంతో అధికారులకు తలనొప్పిగా మారింది.

ehatv
Next Story

