Love Affair: ఆమెకు 48, అతనికి 23.. ఇద్దరికీ పరిచయం, ప్రేమ.. లేచిపోయి మరీ..!

ఆమెకు 20 ఏళ్ల క్రితం పెళ్లయిది. 19 ఏళ్ల కూతురు, 17 ఏళ్ల కొడుకు ఉన్నాడు. అతడు 23 ఏళ్ల యువకుడు. వీరిద్దరికీ ఇన్‌స్టాలో పరిచయం ప్రేమకు దారి తీసింది. ఆదివారం వీరు నగరం నుంచి అదృశ్యమయ్యారు. జూబ్లీహిల్‌ పోలీసుల తెలిపిన ప్రకారం... బిహార్‌కు చెందిన మహిళ (46)కు భర్త, 19, 16 ఏళ్లున్న కుమారుడు, కూతురు ఉన్నారు. 2004లో నగరానికి వలస వచ్చారు. జూబ్లీహిల్స్‌లో ఆమె భర్త వంట మనిషిగా, ఆ మహిళ పని మనిషిగా పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నాలుగేళ్ల క్రితం నిజామాబాద్‌ జిల్లా బాన్సువాడకు చెందిన 23 ఏళ్ల యువకుడితో ఆమెకు ఇన్‌స్టాలో పరిచయమైంది. ప్రేమలో పడిన వీరు నగరంలో తరచూ కలుసుకునేవారు. ఆదివారం ఉదయం ఇద్దరూ కలిసి పరారయ్యారు. భార్య కనిపించడం లేదంటూ భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజీల్లో వివాహితతో పాటు యువకుడు బైక్‌పై వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. వీరి కోసం గాలిస్తున్నట్లు జూబ్లీహిల్స్‌ పోలీసులు తెలిపారు.

Updated On
ehatv

ehatv

Next Story