తెలంగాణ తల్లిని(Telangana thalli statute) కూడా గౌరవించుకోలేని దుస్థితికి వచ్చేశాం!

తెలంగాణ తల్లిని(Telangana thalli statute) కూడా గౌరవించుకోలేని దుస్థితికి వచ్చేశాం! సిద్దిపేట(siddipet) జిల్లా అక్కన్నపేట(akkannapet) మండలం చౌటపల్లిలో(Choutupalli) తెలంగాణ తల్లి విగ్రహానికి ఆదివారం రాత్రి కొందరు దుండగులు నిప్పు(Fire) పెట్టారు. గ్రామంలో ఉన్న బురుజు చౌరస్తా దగ్గర గత ఏడాది తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహావిష్కరణ జరగాల్సి ఉంది. గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహంపై కప్పి ఉంచిన ముసుగుకు నిప్పు పెట్టారు. దీంతో విగ్రహం పాక్షికంగా కాలిపోయింది. విగ్రహం దగ్గరకు చేరుకున్న బీఆర్‌ఎస్‌ నాయకులు తెలంగాణ తల్లి విగ్రహాన్ని నీళ్లతో శుభ్రంగా కడిగి తర్వాత పాలతో అభిషేకం చేశారు. తర్వాత విగ్రహంపై మళ్లీ ముసుగు వేశారు. ఈ దుశ్చర్యపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story