హైదరాబాద్‌(Hyderabad) నగరంలో మత విద్వేషాలను(Relegion Disputes) రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానం కలుగుతోంది.

హైదరాబాద్‌(Hyderabad) నగరంలో మత విద్వేషాలను(Relegion Disputes) రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానం కలుగుతోంది. వరుసగా జరుగుతున్న ఘటనలు ఆ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. సోమవారం సికింద్రాబాద్‌(Secunderabda) ముత్యాలమ్మ ఆలయంలోకి(Muthyalamma temple) దుండగుడు చొరబడి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. ఇప్పుడు అంబర్‌పేటలోని మహంకాళి(Mahankali temple) అలయంపై కొందరు దుండగులు దాడికి ప్రయత్నించారు. ఆలయంపై రాళ్లు రువ్వారు. రెండు నెలల కిందట సంతోష్‌నగర్‌లో అమ్మవారి ఆలయం వద్ద గుర్తుతెలియని వ్యక్తులు విధ్వంసానికి పాల్పడ్డారు. మొన్నటికి మొన్న ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో దసరా నవరాత్రుల సందర్భంగా ఒక మండపం దగ్గర గుర్తుతెలియని వ్యక్తులు విధ్వంసకర చర్యలకు పాల్పడ్డారు. అయితే ఈ ఘటనపై అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని గంటల వ్యవధిలో పట్టుకున్నారు. అతడికి మతిస్థిమితం లేకపోవడంతో ఈ పని చేశాడని పోలీసులు తేల్చారు. ఆ మరుసటి రోజే మాసబ్‌ట్యాంక్‌ ప్రాంతంలో మండపం దగ్గర ఓ మాంసం ముక్క పడి ఉండటాన్ని భక్తులు గమనించి ఆందోళన చేశారు. అయితే ఆ మాంసం ముక్క కుక్క పడేసిందని సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు కనుగొన్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story