నల్గొండ జిల్లా నాగార్జునసాగర్, నందికొండ మున్సిపాలిటీ పరిధిలో నివాసం ఉంటున్న సిద్వంతి అనే మహిళ భర్త రెండున్నర ఏళ్ల కింద మరణించాడు

నల్గొండ జిల్లా(Nalgonda) నాగార్జునసాగర్(Nagarjuna Sagar), నందికొండ మున్సిపాలిటీ(Nandikonda municipality) పరిధిలో నివాసం ఉంటున్న సిద్వంతి(Sidhvanti) అనే మహిళ భర్త రెండున్నర ఏళ్ల కింద మరణించాడు, అప్పటినుండి ఇద్దరు కుమార్తెలతో పుట్టింట్లోనే ఉంటుంది. రెండేళ్ల కిందట చిన్న కుమార్తె హారిక(Harika) ఇంటి ముందు ఆడుకుంటుండగా వీధి కుక్కలు దాడి చేయడంతో, నాగార్జునసాగర్ కమల నెహ్రూ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. రెండో డోసు కుక్కకాటు టీకా వేసిన అనంతరం హారిక వారం రోజుల పాటు జ్వరంతో బాధ పడింది. జ్వరంతో ఉన్నప్పుడే మూడో డోసు టీకా ఇచ్చారు. జ్వరం ఎంతకీ తగ్గకపోవడంతో హారికను హైదరాబాద్ ఫీవర్ హాస్పిటల్‌కు రిఫర్ చేశారు. హైదరాబాద్ ఫీవర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నప్పుడే హారిక కాళ్లు చేతులు స్పర్శ లేకుండా మారాయి. దీంతో నిలోఫర్ ఆసుపత్రి(Niloufer hospital)కి తరలించగా హారిక పూర్తిగా కోమాలోకి వెళ్లింది. ఒకటిన్నర ఏళ్ల నుండి నల్గొండ, హైదరాబాద్‌లో పలు ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసినా ఫలితం లేదని హారిక తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది. నా కూతురు ఉలుకు పలుకు లేకుండా పడి ఉందని, అమ్మా అని కూడా పిలవట్లేదని, ప్రభుత్వం స్పందించి వైద్యానికి సహకరిస్తే రుణపడి ఉంటానని హారిక తల్లి సిద్వంతి వేడుకుంటోంది

Updated On
ehatv

ehatv

Next Story