రోడ్ పక్కన గత 13 సంవత్సరాలుగా రకరకాల వంటలు చేస్తూ జీవనం గడుపుతున్న కుమారి ఆంటీ(Kumary aunty).

కుమారి ఆంటీ(Kumary aunty) ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ఈ పేరు ఫేమస్. ఎంతగా ఫేమస్ అయిందంటే బిగ్ బాస్(Bigg boss) షోలో పార్టిసిపేట్ చేసేటంతగా అంటే అతిశయోక్తి కాదు. కానీ కుమారి ఆంటీ కి అంత పాపులారిటీ ఒక్క రోజులో రాలేదు. గత 13 సంవత్సరాలుగా రోడ్డుపక్కన(Street food) చిన్న బండి పెట్టుకుని రకరకాల వంటలు చేసి అమ్ముతుంది. తన మాటలనే మెనూ కార్డు గా చేసి మరీ కస్టమర్స్ కి తన దగ్గర ఉన్న వంటకాలను వివరించేది. టేస్ట్, శుచి, శుభ్రత ఉండడంతో పాటు అందరికి అందుబాటు ధరలో ఉండడంతో రోజు రోజుకి కస్టమర్స్ పెరిగారు. అలా ఒకరోజు ఒక యూట్యూబర్(Youtuber) కుమారి ఆంటీ దగ్గర భోజనం చేసి రుచి నచ్చడంతో తన ఛానల్ లో వీడియో తీసి పెట్టాడు. అక్కడిదాకా బాగానే ఉంది కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైయింది. తీసుకున్న ఐటమ్స్ తో పాటు 2 లివర్స్ ఎక్స్ట్రా అని అనడమే పొరపాటు అయింది. 2 లివర్స్ ఎక్స్ట్రా 1000 రూ. బాబు అనడంతో ఆ చిన్న వీడియో ట్రోల్ అయింది. ఇక అక్కడితో కుమారి అంటీ రెండు తెలుగు రాష్ట్రాలలో ఫేమస్ అయిపోయింది. సినీ స్టార్ట్ తో పాటు స్వయంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth reddy) కూడా కుమారి అంటీ వంటల రుచి చూసేదాకా పాపులారిటీ అయింది. అయితే ఇప్పుడు కుమారి ఆంటీ బిగ్ బాస్ కి వెళ్తుంది అంటూ వస్తున్న వార్త నిజామా కదా అంటే కొంత కాలం ఆగాల్సిందే....

Updated On
Eha Tv

Eha Tv

Next Story