మేడ్చల్ జిల్లా కండ్లకోయలోని సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో ఉద్రిక్తత నెలకొంది.

మేడ్చల్ జిల్లా కండ్లకోయలోని సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో ఉద్రిక్తత నెలకొంది. సీఎంఆర్ గర్ల్స్ హాస్టల్(CMR Girls Hostel) బాత్‌రూంలో కెమెరాలు అమర్చినట్లుగా విద్యార్థినులు గుర్తించారు. కెమెరాలు అమర్చి రహస్యంగా తమ వీడియోలు చిత్రీకరిస్తున్నట్లు ఆరోపించారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున కాలేజీలో విద్యార్థినీవిద్యార్థులు ఆందోళనకు చేపట్టారు. 300 వీడియోలు తీసినట్లు విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. కాలేజ్ యాజమాని అయిన ఎమ్మెల్యే మల్లారెడ్డే(MLA Malla Reddy) దీనికి బాధ్యత వహించాలని విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు. వీడియోలు తీసినవారు వంట సిబ్బంది అన్న అనుమానాలు రేకెత్తుతుతున్నాయి. బాధ్యులను కఠినంగా శిక్షించాలని విద్యార్థినీవిద్యార్థులు కోరుతున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి హాస్టల్ సిబ్బందికి చెందిన 12 మంది ఫోన్లను తీసుకొని విచారిస్తున్నారు. ఈ కేసులో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
