✕
Supreme Court is angry with the Speaker.. Should action be taken against those 10 people..!

x
తెలంగాణ స్పీకర్‌పై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ స్పీకర్ కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని.. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని BRS ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. CJI BR గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. వచ్చే వారంలోపు నిర్ణయం తీసుకుంటారా లేదా కోర్టు ధిక్కారాన్ని ఎదుర్కొంటారా అని వ్యాఖ్యానించింది. స్పీకర్‌కు రాజ్యాంగపరమైన ఇమ్యూనిటీ లేదని మేము ఇప్పటికే నిర్ధారించామన్నారు. ఆయన తన నూతన సంవత్సరం వేడుకులను ఎక్కడ గడపాలనుకుంటున్నారో నిర్ణయించుకోవడం ఆయన ఇష్టమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

ehatv
Next Story

