మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది

మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది
మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు తలసాని శంకర్ యాదవ్ సోమవారం ఉదయం మృతి చెందారు. శంకర్ యాదవ్ గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సికింద్రాబాద్ లోని యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆరోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. మారేడ్‌పల్లిలోని నివాసానికి శంకర్ యాదవ్ మృతదేహాన్ని తరలించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ బిఆర్‌ఎస్ పార్టీలో కీలక నేత. సనత్ నగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గతంలో బీఆర్‌ఎస్ పార్టీలో రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. ఇక మోండా మార్కెట్ చైర్మన్ గా తలసాని శంకర్ యాదవ్ ఉన్నారు.
శంకర్ యాదవ్ మృతిపట్ల బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన భౌతికకాయానికి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులు నివాళులర్పించారు.
