బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీకి సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్య రాజీనామా చేశారు.

Tatikonda Rajaiah resigns from BRS
బీఆర్ఎస్(BRS) పార్టీకి గట్టి షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీకి సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్య(Thatikonda Rajaiah) రాజీనామా చేశారు. ఆరు నెలలుగా తనకు పార్టీ మానసిక అవేదన కలించిందని రాజయ్య చెప్పారు. పార్టీకి వీరవిధేయుడిగా ఉన్నా తనను పట్టించుకోవడం లేదని రాజయ్య అన్నారు. గత ఎన్నికల్లో రాజయ్యకు బీఆర్ఎస్ అధిష్ఠానం ఎమ్మెల్యే టికెట్(MLA Ticket) కేటాయించేందుకు నిరాకరించింది.ఈ క్రమంలోనే ఆయనకు ఎంపీ టికెట్ ఇస్తారని చెప్పారని రాజయ్య వర్గం ప్రచారం జరిపింది. పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ పార్టీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. కాంగ్రెస్‌లో చేరికపై రాజయ్య మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivasa Reddy)తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది.
