తెలంగాణలో తెలుగుదేశంపార్టీకి పూర్వవైభవాన్ని తీసుకొస్తానని హైదరాబాద్‌ మాజీ మేయర్‌ తీగల కృష్ణారెడ్డి. త్వరలో తెలుగుదేశంపార్టీలో చేరతానన్నారు.

తెలంగాణలో తెలుగుదేశంపార్టీకి పూర్వవైభవాన్ని తీసుకొస్తానని హైదరాబాద్‌ మాజీ మేయర్‌ తీగల కృష్ణారెడ్డి. త్వరలో తెలుగుదేశంపార్టీలో చేరతానన్నారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిందే చంద్రబాబునాయుడు అని పొగడ్తలు కురిపించారు. తెలంగాణ(Telangana)లో టీడీపీ(TDP)కి బోల్డంత మంది అభిమానులు ఉన్నారన్నారు. తన మనవరాలి పెళ్లి పత్రిక ఇవ్వడానికి మాజీ మంత్రి మల్లారెడ్డి(Mallareddy) చంద్రబాబు(Chandrababu)ను కలిశారు. ఆయన వెంట తీగల కృష్ణారెడ్డి(Teegala Krishna Reddy), మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్‌రెడ్డి(Rajeshekar Reddy) కూడా ఉన్నారు. త్వరలో టీడీపీలో చేరతానని తీగల కృష్ణారెడ్డి చెబుతున్నప్పుడు వెనకాలే వీరిద్దరు ఉన్నారు. మల్లారెడ్డి, రాజశేఖర్‌రెడ్డిలు కూడా టీడీపీలో చేరతారా లేక బీఆర్‌ఎస్‌(BRS)లోనే ఉంటారా అన్నది మాత్రం తేలాల్సి ఉంది.

Updated On
ehatv

ehatv

Next Story