తెలంగాణలో త్వరలో జరగనున్న రాజ్యసభ ఉప ఎన్నికకు అభిషేక్ సింఘ్వీ అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సిఎల్‌పి) ఆదివారం రాత్రి ఆమోదించింది

తెలంగాణలో త్వరలో జరగనున్న రాజ్యసభ ఉప ఎన్నికకు అభిషేక్ సింఘ్వీ అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సిఎల్‌పి) ఆదివారం రాత్రి ఆమోదించింది. దీంతో అభిషేక్ సింఘ్వీ సోమవారం నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. సీఎల్పీ సమావేశం అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. ఈ సమావేశంలో అభిషేక్ సింఘ్వీని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు పరిచయం చేసినట్లు చెప్పారు. ఆయ‌న‌ను మనస్పూర్తిగా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. సింఘ్వీ సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్న‌ట్లు పేర్కొన్నారు.

సింఘ్వీ ఎన్నిక.. తెలంగాణ ఆందోళనలు, సమస్యలను పార్లమెంటులోనే కాకుండా కోర్టులలో కూడా హైలైట్ చేయడానికి సహాయపడుతుందని అన్నారు. 2014లో విభజన తర్వాత పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌తో ఏర్పడిన వివాదాల‌కు కూడా ప‌రిష్కారం ల‌భిస్తుంద‌ని అన్నారు. సింఘ్వీ రాజ్యసభకు ఎన్నిక అయితే తెలంగాణ హక్కులను కాపాడుకోవడానికి దోహదపడుతుందని సీఎం అన్నారు.

Updated On
Sreedhar Rao

Sreedhar Rao

Next Story