గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లపై పలు కీలక సూచనలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లపై పలు కీలక సూచనలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. టెంపుల్ సెంట్రిక్ ఘాట్స్ అభివృద్ధికి ప్రాధాన్యతనివ్వాలని సీఎం సూచించారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ప్రముఖ ఆలయాలను మొదటి ప్రాధాన్యతగా తీసుకుని శాశ్వత ఘాట్స్ నిర్మాణాలు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహకంలోని ఆలయాలను క్షేత్రస్థాయిలో సందర్శించి అనువైన వాటిని ఎంపిక చేయాలన్న సీఎం చెప్పారు. బాసర, కాళేశ్వరం, ధర్మపురి, భద్రాచలంతో పాటు ఇతర ప్రముఖ ఆలయాలను సందర్శించి జాబితాను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, జాతీయ రహదారులు, రాష్ట్ర పరిధిలోని జాతీయ రహదారుల సమీపంలో ఉన్న గోదావరి పరివాహక ఆలయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. ప్రస్తుతం ఉన్న ఘాట్స్ ను విస్తరించడంతో పాటు రోడ్లు, ఇతర సౌకర్యాలను శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. పుష్కరాల సమయంలో దాదాపు 2 లక్షల మంది ఒకేసారి ఘాట్స్ వద్ద స్నానమాచరించేందుకు వీలుగా ఉండేలా అభివృద్ధి చేయాలని సీఎం ఆదేశించారు. ప్రతీ ఆలయానికి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వేర్వేరరుగా ఘాట్స్ డిజైన్లు రూపొందించాలన్న సీఎం.. పర్యాటక శాఖ , నీటిపారుదల శాఖ, దేవాదాయ శాఖ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

ehatv

ehatv

Next Story