తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy)ని తమవాడుగా భావిస్తుంటారు తెలుగు తమ్ముళ్లు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి(Ap CM), తెలుగుదేశంపార్టీ(TDP) అధినేత నారా చంద్రబాబునాయుడు(Chandra Babu Naidu) ఎంత కాదనుకున్నా రేవంత్‌రెడ్డి గురువే కదా!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy)ని తమవాడుగా భావిస్తుంటారు తెలుగు తమ్ముళ్లు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి(Ap CM), తెలుగుదేశంపార్టీ(TDP) అధినేత నారా చంద్రబాబునాయుడు(Chandra Babu Naidu) ఎంత కాదనుకున్నా రేవంత్‌రెడ్డి గురువే కదా! చంద్రబాబు తన గురువు అంటే ము... మీద తంతానని విలేకరుల ఎదుట రేవంత్‌రెడ్డి అంటే అని ఉండవచ్చు కానీ చంద్రబాబు, రేవంత్‌లది గురు శిష్య అనుబంధం అన్నది లోక విదితమే! తెలంగాణలో రేవంత్‌ రెడ్డి విజయం కోసం ఇక్కడి తెలుగుదేశం పార్టీ వీరాభిమానులు శతవిధాలా ప్రయత్నించారు. అలాంటిది తనను అభిమానించే టీడీపీ హార్డ్‌కోర్‌ కార్యకర్తలకు రేవంత్‌రెడ్డి చిన్నపాటి షాకిచ్చారు. ఆదివారం రేవంత్‌రెడ్డి క్షత్రియ సేఆ సమితి (KSHATRIYA SEVA SAMITHI)నిర్వహించిన అభినందన సభలో పాల్గొన్నారు. పాల్గొంటే పాల్గొన్నారు కానీ తాము నిత్యం ద్వేషించుకునే దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ(RamGopal Varma)ను పొగడటమే వారికి నచ్చలేదు. టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ వరకు సత్తా చాటిన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తనకు మంచి మిత్రుడని రేవంత్‌రెడ్డి చెప్పుకొచ్చారు. రామ్‌గోపాల్‌ వర్మ తెలుగుదేశంపార్టీకి (ఎన్టీఆర్‌ స్థాపించిన టీడీపీ కాదు) బద్ద వ్యతిరేకి అని అందరికీ తెలుసు. చంద్రబాబును ఓ ఆట ఆడుకున్నారు వర్మ. చంద్రబాబును ఉద్దేశించి పలు సినిమాలు కూడా తీశారు. చంద్రబాబు క్యారెక్టర్‌ను నెగటివ్‌గానే చూపించారు. చంద్రబాబులాంటి వ్యక్తిని ఏరికోరి తీసుకొచ్చి ఆ క్యారెక్టర్‌ ఇచ్చారు వర్మ. ఇక సోషల్‌ మీడియాలో అయితే వర్మ ఎన్ని సెటైర్లు విసిరారో ! అదే సమయంలో తన సినిమాలలో వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy)ని హీరోలా చూపించారు వర్మ. తెలుగుదేశం పార్టీ క్యాడర్‌కు ఇక్కడే మండింది. తమ బాస్‌ను సినిమాల్లో విలన్‌గా చూపించడం టీడీపీ వారికి అసలు నచ్చలేదు. వర్మను తిట్టిపోస్తున్నది అందుకే! అలాంటి వర్మను రేవంత్‌రెడ్డి మెచ్చుకోవడం చాలా మంది టీడీపీ వారికి నచ్చలేదు.

Updated On
ehatv

ehatv

Next Story