సాధారణంగా సమాచర హక్కు చట్టం ఉన్నదే అక్రమార్కుల గుట్టు బయటపెట్టేందుకు.. ఏదైనా పనుల్లో కానీ

సాధారణంగా సమాచర హక్కు చట్టం ఉన్నదే అక్రమార్కుల గుట్టు బయటపెట్టేందుకు.. ఏదైనా పనుల్లో కానీ, కాంట్రాక్టుల్లో కానీ అవినీతి జరిగినా, ఇతర వ్యవహారాల్లో రహస్యాలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో RTIని ఆశ్రయిస్తుంటాం. RTI ఇచ్చిన ప్రకారం కోర్టుల్లో లేదా ఇతరత్రా న్యావవ్యవస్థలను ఆశ్రయిస్తుంటారు. కానీ RTIలో కూడా లంచాలు ఉంటే ఏంటి పరిస్థితి, ఇలాంటి తరహా ఘటనే ఒకటి జరిగింది. RTI ద్వారా సమాచారం అడిగినందుకు 15 వేలు లంచం డిప్యూటీ ఎమ్మార్వో డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా గట్టుప్పల్ మండలం తెరట్పల్లి గ్రామంలో తన తండ్రి పేరు మీద ఉన్న భూమి వేరే వ్యక్తుల పేరు మీదకి అక్రమ రిజిస్ట్రేషన్ అయిందని.. అది ఎలా, ఏ సంవత్సరం జరిగిందో తెలపాలని సమాచార హక్కు చట్టం కింద ఓ రైతు దరఖాస్తు చేసుకున్నాడు. దానికి పేపర్ ఖర్చులు ఉంటాయని రూ.15 వేలు లంచం డిమాండ్ చేసిన డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్. దీంతో దిక్కుతోచని పరిస్థితిలో ఏసీబీ అధికారులను రైతు ఆశ్రయించాడు. రైతు దగ్గర నుండి బాలాపూర్ నివాసంలో డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు

Updated On
ehatv

ehatv

Next Story