ఈనెల 18వ తేదీన వివిధ పార్టీలు తలపెట్టిన బంద్ కార్యక్రమాన్ని శాంతియుతంగా జరుపుకోవాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ బి.శివధర్ రెడ్డి స్పష్టం చేశారు.

ఈనెల 18వ తేదీన వివిధ పార్టీలు తలపెట్టిన బంద్ కార్యక్రమాన్ని శాంతియుతంగా జరుపుకోవాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ బి.శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. బంద్ పేరుతో అవాంఛనీయ సంఘటనలకు గానీ, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు గానీ పాల్పడినట్లయితే చట్టం ప్రకారం కఠినంగా వ్యవహరిస్తామని డిజిపి అన్నారు. పోలీస్ సిబ్బంది, నిఘా బృందాలు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తాయని, బంద్ సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని డిజిపి సూచించారు. సాధారణ ప్రజలకు సమస్యలు ఎదురవకుండా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు.

Updated On
ehatv

ehatv

Next Story