హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కూల్చివేతలపై హైకోర్టు(High Court)లో విచారణకు వర్చువల్‌ హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌(Hydra Commissioner AV Ranganath) హాజరయ్యారు. ఆదివారం కూల్చివేయకూడదని గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు మీకు తెలియదా అని ప్రశ్నించింది. ఆదివారం మీరు ఎందుకు పనిచేస్తున్నారు.. అసలు మీకు రూల్స్‌ తెలుసా అంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అమీన్‌పూర్‌ తహశీల్దార్‌(Aminpur MRO)పై కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేతలు చేస్తున్నారో చెప్పాలని.. పత్రికలు చెప్పినట్లు వింటున్నారా లేక లా ఫాలో అవుతున్నారా అన్న అనుమానం వ్యక్తం చేసింది. హైడ్రాకు ఉన్న చట్టబద్దత ఏంటో చెప్పాలని.. చట్టాన్ని ఉల్లంఘించి కూల్చివేతలు చేస్తున్నారని.. ఆదివారం కూల్చివేతలు చేపట్టవద్దని ఇదే హై కోర్టు ఇచ్చిన ఆదేశాలు మీకు తెలియదా అని ప్రశ్నించింది.

Updated On
ehatv

ehatv

Next Story