తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయం కేంద్రంగా కొన్ని కొన్ని వింత సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయం కేంద్రంగా కొన్ని కొన్ని వింత సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మంత్రి పేషీలో ఒక నకిలి అధికారి అని చెప్పి ఏకంగా, మంత్రి పేరు చెప్పి డబ్బులు కాజేశారని చెప్పి మోసానికి పాల్పడ్డారు. ఒకసారి ఏకంగా యూనిఫామ్ సర్వీస్‌లో కూడా ఒక నకిలి వ్యక్తి ఎంటర్ కావడం మనం చూశాం. మంత్రి పేషిలో జరిగినటువంటి అంశాలు మంత్రి సూచనలో లేవా ఆయన కనుసైగలో లేవా, కనీసం ఆయన పట్టించుకోవడం లేదా అనే రకంగా అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తాజాగా తెలంగాణ సచివాలయంలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేషీలో మంత్రి పేషి పేరుతో ఒక భారీ మోసం తెరమీదకి వచ్చింది. ఐటీ మంత్రి పేషీని అడ్డాగా చేసుకొని ప్రాజెక్టు మంజూరు చేస్తామంటూ కోటి 77 లక్షల రూపాయలు తీసుకొని మోసం చేశారు. మియాపూర్ ఐటి ఇంజనీర్ ను లక్ష్యంగా చేసుకొని నకిలీ పత్రాలతో కోటి 77 లక్షల రూపాయలని కాజేశారు కేటగాళ్లు. అయితే మంత్రి ఓఎస్జీ లెటర్ హెడ్‌లు, నకిలీ పత్రాలు చూపి మోసం చేసినట్టుగా తెలుస్తోంది. ఏకంగా ఆయన పేషీని అడ్డాగా మార్చుకొని మియాపూర్ ఇంజనీర్ ని టార్గెట్ గా చేసుకొని కోటి 77 లక్షలు మోసానికి పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదుతో ఆరుగురి పైన కేసు నమోదయింది

Updated On
ehatv

ehatv

Next Story