ఇంజనీరింగ్ అద్భుతం, ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ లిఫ్ట్ ఇరిగేషన్ పథకంగా చెప్తున్న కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తెలంగాణ నీటి భద్రత, వ్యవసాయానికి ఉపయోగపడుతుంది.

ఇంజనీరింగ్ అద్భుతం, ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ లిఫ్ట్ ఇరిగేషన్ పథకంగా చెప్తున్న కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తెలంగాణ నీటి భద్రత, వ్యవసాయానికి ఉపయోగపడుతుంది. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గోదావరి తాగునీటి పథకం దశ II, III లకు శంకుస్థాపన చేయనున్నారు.

కాళేశ్వరంలో భాగంగా 50 TMC నిల్వ సామర్థ్యం కలిగిన మల్లన్న సాగర్ జలాశయం ఉంది. దీని ద్వారా హైదరాబాద్‌కు తాగునీటిని అందించడమే కాకుండా, మూసీ నదిని పునరుజ్జీవింపజేయడంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించిన ఈ ప్రాజెక్టు 13 జిల్లాల్లో 500 కి.మీ. విస్తీర్ణంలో 1,800 కి.మీ. కాలువ నెట్‌వర్క్‌తో, 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి రూపొందించబడింది.

అయితే మేడిగడ్డ కూలిపోయిందని, కాళేశ్వరంలో ఉన్న కన్నెపల్లి పంప్‌ హాస్‌ ద్వారా నీటిని ఈ ప్రభుత్వం ఎత్తిపోయలేదు. దీంతో రెండు నెలలు ఆలస్యంగా గోదావరికి వరద రావాడంతో ఎస్‌ఆర్‌ఎస్పీ నుంచి నీటిని ఎత్తిపోసి మిడ్ మానేరు అక్కడి నుంచి దిగువ ప్రాజెక్టులపై రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్‌కు నీటిని ఎత్తిపోస్తున్నారు. దీంతో వరి నాటుకు ఆయా ప్రాజెక్టుల కింద ఆయకట్టు ప్రాంతంలో వరినాట్లకు ఆలస్యమైంది. సకాలంలో మోటార్లు ఎందుకు ఆన్‌ చేయలేదని ప్రతిపక్ష పార్టీ బీఆర్‌ఎస్‌ ప్రశ్నించింది. బనకచర్ల ప్రాజెక్టు కోసం, డెల్టా ప్రాంతానికి నీరు వెళ్లాలన్న చంద్రబాబు కుట్రలో భాగంగా రేవంత్‌రెడ్డి కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోయేలదని బీఆర్‌ఎస్ విమర్శించింది. అయితే మల్లన్నసాగర్‌ ద్వారా హైదరాబాద్‌కు తాగునీటిని అందించే గోదావరి ప్రాజెక్టుకు నీటిని ఎత్తిపోసే పథకానికి సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేస్తుండడంతో టైమ్స్‌ ఆఫ్ ఇండియా ఓ కథనాన్ని ప్రచురించింది. 2025-26లో 2,350 టీఎంసీల గోదావరి నీరు, 726 టీఎంసీల కృష్ణా నీరు సముద్రంలోకి వృథా కలిసిపోయాయి, కాళేశ్వరం ప్రాజెక్ట్ అండర్-యూటిలైజేషన్ కారణంగా. జూన్ నుంచి సెప్టెంబర్ 7 వరకు ఈ నష్టం జరిగినట్లు ఆ పత్రికా కథనం.

ehatv

ehatv

Next Story