ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలన్నీ జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక చుట్టే జరుగుతున్నాయి.

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలన్నీ జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక చుట్టే జరుగుతున్నాయి. ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారు అనే ఉత్కంఠగా మారింది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ గెలుపు కోసం ప్రణాళికలు రచిస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. మరోవైపు.. ఉప ఎన్నిక నేపథ్యంలో భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు అవుతున్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పట్టున్న ఎంఐఎం ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు తెలిపింది. ఇక, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి తన నామినేషన్ వేశారు. ఈ క్రమంలో యూసఫ్‌గూడ హైలం కాలనీ నుంచి షేక్‌పేట్ తహశీల్దార్ ఆఫీస్ వరకు నామినేషన్ ర్యాలీ చేపట్టారు. చివరి రోజున ప్రధాన పార్టీల అభ్యర్థులు మరో సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. ఇప్పటివరకు 127 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్లను అక్టోబర్ 22న పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు 24. నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా, ఓట్ల లెక్కింపు నవంబర్ 14న చేపట్టనున్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం తమను మోసం చేసిందంటూ నిరుద్యోగులు నామినేషన్లు వేస్తుండగా.. RRR భూముల రైతులు కూడా నామినేషన్లు వేయనున్నట్లు సమాచారం.
