లంచం(Bribe) కేసులో ప్రభుత్వ అధికారి అవినీతి నిరోధక శాఖ(anti corruption bureau) అధికారులకు చిక్కారు.

లంచం(Bribe) కేసులో ప్రభుత్వ అధికారి అవినీతి నిరోధక శాఖ(anti corruption bureau) అధికారులకు చిక్కారు. వరంగల్(Warangal) కమిషనరేట్‌ పరిధిలోని పర్వతగిరి(Parvathagiri) పోలీస్‌స్టేషన్‌ ఎస్సై(Police SI) గూగులోత్ వెంకన్న ఏసిబి అధికారులకు చిక్కారు. పక్కా సమాచారం మేరకు స్థానిక ఎస్ఐ గుగులోత్ వెంకన్నపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. నిన్న గుడుంబా రవాణా చేస్తున్న బాదవత్ బాస్కర్ వాహనాన్ని వదిలిపెట్టి పారిపోగా వారి వద్ద నలబై వేల రూపాయలు లంచం అడిగినట్లు వారు ఏసీబీ అధికారులను సంప్రదించినట్లు సమాచారం. పోలీస్ స్టేషన్‌లో డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్న సదానందం ద్వార మంతనాలు జరిపి అజ్మీర వెంకట్ అనే వ్యక్తికి 20వేల రూపాయలు ఫోన్ పే ట్రాన్సాక్షన్ జరిగినట్లు ఏసీబీ అధికారులను నిర్ధారణకు వచ్చి కేసు బుక్ చేసి తదుపరి విచారణ చేపడుతున్నట్లు తెలిపారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story