హైదరాబాద్‌(Hyderabad) నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో(Nampally Exhibition Grounds) నెలకొల్పిన అమ్మవారి విగ్రహాన్ని(Godess idol) గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు.

హైదరాబాద్‌(Hyderabad) నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో(Nampally Exhibition Grounds) నెలకొల్పిన అమ్మవారి విగ్రహాన్ని(Godess idol) గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న బేగంబజార్‌ పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ప్రతి సంవత్సరం అమ్మవారి విగ్రహాన్ని ఎగ్జబిషన్‌ సొసైటీ ,సిబ్బంది ఆధ్వర్యంలో నెలకొలుపుతారు

గురువారం రాత్రి దాండియా ప్రోగ్రాం పూర్తి అయ్యే వరకు ఆ గ్రౌండ్‌లోనే పోలీసులు ఉన్నారు. వార్త తెలియగానే ఆబిడ్స్‌ ఏసీపీ చంద్రశేఖర్‌ సంఘటన స్థలానికి చేరుకున్నారు. మొదట కరెంట్ కట్‌ చేసి, సీసీ కెమెరాలు విరగొట్టి, తర్వాత విగ్రహం చేతిని విరగొట్టారు. పూజా సామాను అంతా చిందరవందర చేశారు. అమ్మవారి చుట్టూ ఉన్న బారికేడ్స్‌ను కూడా దుండగులు తొలగించారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story