క్యాబ్‌ డ్రైవర్ల బందుకు తీన్మార్‌ మల్లన్న మద్దతు..

ఓలా(Ola), ఊబర్‌(Uber), ర్యాపిడో(Rapido) తదితర యాప్‌లలో ఇతర రాష్ట్రాల వాహనాలు ఇక్కడ వ్యాపారం సాగిస్తున్నాయి. దీంతో ఇక్కడి డ్రైవర్లు ఉపాధి కోల్పోతున్నారు. డ్రైవర్ల సమస్యలను కాంగ్రెస్‌(congress) ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నది వారి కంప్లయింట్‌. ప్రభుత్వ దృష్టికి తమ సమస్యను తీసుకెళ్లడానికి ఈ నెల15వ తేదీన ఓలా, ఉబెర్‌, ర్యాపిడో డ్రైవర్లు బందుకు పిలుపునిచ్చారు. ఈ బందుకు కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న మద్దతు పలికారు. అయితే మల్లన్న మద్దతు పలకడం కుట్రగానే భావిస్తున్నారు కొందరు డ్రైవర్లు. చిత్రమేమిటంటే స్వాతంత్ర దినోత్సవం రోజున క్యాబ్‌లు అరకొరగానే నడుస్తాయి. ఆ రోజున బందుకు పిలుపు ఇవ్వడమేమిటి? దానికి తీన్మార్‌ మల్లన మద్దతు చెప్పడమేమిటి? కామెడీ కాకపోతే అని కొందరు అంటున్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story