తెలంగాణలో ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో గ్రామీణ రోడ్ల నిర్వహణకు హ్యాం మోడల్‌ను అమలుచేస్తామని డిప్యూటీ సీఎం భట్టి ప్రకటించారు.

తెలంగాణలో ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో గ్రామీణ రోడ్ల నిర్వహణకు హ్యాం మోడల్‌ను అమలుచేస్తామని డిప్యూటీ సీఎం భట్టి ప్రకటించారు. అసలు హ్యాం మోడల్‌ అంటే.. బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్ (BOT), ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్ అండ్ కన్‌స్ట్రక్షన్ (EPC) ఫ్రేమ్‌వర్క్‌ల సమ్మేళనం అయిన HAM మోడల్, 2016లో భారతదేశంలో జాతీయ రహదారి ప్రాజెక్టుల కోసం ప్రవేశపెట్టారు. HAM కింద ప్రభుత్వం ప్రాజెక్ట్ వ్యయంలో 40 శాతం నిధులు సమకూరుస్తుంది. అయితే ఇందులో ఈక్విటీ, రుణాల ద్వారా ప్రైవేట్ డెవలపర్లు మిగిలిన 60 శాతాన్ని కవర్ చేస్తారు. తమ పెట్టుబడులను తిరిగి పొందేందుకు ప్రైవేట్ డెవలపర్‌లు టోల్ ఛార్జీలు వసూలు చేస్తారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం అందుకు బదులుగా, ప్రభుత్వం ఒక దశాబ్దంలో డెవలపర్‌లకు తిరిగి చెల్లిస్తుంది, ఆ సమయంలో వారు రోడ్లను కూడా నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు.

Updated On
ehatv

ehatv

Next Story