తెలంగాణలోనే దిక్కులేదు.. ఇక మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ పార్టీని నడిపిస్తా అని గంభీర్యాలు పలికిన కేసీఆర్ బోల్తాపడ్డాడని టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ ఎద్దేవా చేశారు.

తెలంగాణలోనే దిక్కులేదు.. ఇక మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ పార్టీని నడిపిస్తా అని గంభీర్యాలు పలికిన కేసీఆర్ బోల్తాపడ్డాడని టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ఓటమి పట్ల మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల ప్రజలు బాధపడుతున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించడం పట్ల మధుయాష్కి గౌడ్ స్పందించారు.

పదేళ్లపాటు అహంకారంతో ప్రజలను పట్టించుకోకుండా, సామాన్యుల సమస్యలు వినకుండా పరిపాలన చేసిన కేసీఆర్.. ప్రజలు బాధపడుతున్నారంటూ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. దిగజారుడు మాటలు ఆయన మానసిక స్థితిని తెలియజేస్తున్నాయన్నారు. ఓటమి బాధ నుంచి బయటపడని కేసీఆర్.. తన పరిపాలనలో ఎక్కడ తప్పు చేశానన్న విషయంపై ఆత్మ విమర్శ చేసుకోవటం లేదన్నారు. తన మాయమాటలతో ప్రజలను ఇంకా మభ్య పెట్టాలని చూస్తున్నాడని విమర్శించారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story