యూరియా వచ్చిందని తెలిసి ఒక్క బస్తా అయినా తెచ్చుకొని తమ పంటను కాపాడుకుందామని వెళ్తున్న ఓ మహిళను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది.

యూరియా వచ్చిందని తెలిసి ఒక్క బస్తా అయినా తెచ్చుకొని తమ పంటను కాపాడుకుందామని వెళ్తున్న ఓ మహిళను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లా తాండూరు మండలం గోపాల్‌రావ్‌పేటలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం గోపాల్‌రావుపేట గ్రామానికి చెందిన రైతుల పోగుల మల్లేష్‌, నానక్క దంపతులు. వీరికి అన్షిత్‌ అనే ఆరేళ్ల బాబుకు కూడా ఉన్నాడు. రేచినిలో యూరియా బస్తాలు పంపిణీ చేస్తున్నారన్న సమచారంతో తొలుత భర్త మల్లేష్‌ తల్లితో కలిసి ఉదయమే అక్కడికి వెళ్లారు. తన భార్య కూడా వస్తే మరో బస్తా యూరియా దొరొకుతుందన్న ఉద్దేశంతో భార్యను రేచినికి రావాలని కోరాడు. దీంతో పిల్లాడిని స్కూల్‌కు పంపించిన నానక్క, ఓ ద్విచక్రవాహనదారుడిపై వెళ్తున్న క్రమంలో గోపాల్‌నగర్‌ గ్రామపంచాయతీ మూలమలుపు దగ్గర స్కూల్‌ బస్సు వీరి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నానక్క, బైక్‌ నడడుపుతున్న మారుతీకి తీవ్రగాయాలయ్యాయి. వారిని మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌ తరలిస్తుండగా నానక్క మార్గమధ్యలోనే మృతి చెందారు. తల్లి చనిపోయిందని తెలియడంతో ఆమె కుమారుడు విలపించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది.

ehatv

ehatv

Next Story