తెలంగాణలో పోలీసు(TS Police) రాజ్యం వచ్చింది.

తెలంగాణలో పోలీసు(TS Police) రాజ్యం వచ్చింది. ఈ రోజు నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు 30 రోజులు పాటు పోలీస్ యాక్ట్(Police act) 1861 అమలు చేయనున్నారు.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ యాక్ట్ దిశగా తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్(congress) ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వంపై రోజురోజుకీ పెరుగుతున్న వ్యతిరేకతే ఇందుకు కారణమని అంటున్నారు.నిరసనలు, ధర్నాలు, ఎమ్మెల్యేల నివాసాల ముట్టడి, మంత్రులను అడ్డుకోవడం వంటి తదితర అంశాలపై ఇంటలిజెన్స్ హెచ్చరిక నేపథ్యంలో రేవంత్(Revanth reddy) సర్కార్ అప్రమత్తం అయ్యింది. రానున్న రోజుల్లో ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆందోళనలు పెరిగే అవకాశం ఉందనే సమాచారం రావడం తో రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ యాక్ట్‌ను అమలు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

Updated On
Eha Tv

Eha Tv

Next Story