వీధి కుక్కల(street dogs) దాడుల్లో చిన్నారులు మృతి(Children death) చెందడం, పలువురికి గాయాలు కావడంపై తెలంగాణ హైకోర్టు(TS high Court) ఆగ్రహం వ్యక్తం చేసింది.

వీధి కుక్కల(street dogs) దాడుల్లో చిన్నారులు మృతి(Children death) చెందడం, పలువురికి గాయాలు కావడంపై తెలంగాణ హైకోర్టు(TS high Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. కుక్కల దాడుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో ఉందని ఆక్షేపించింది. వీధి కుక్కల నుంచి చిన్నారులను, ప్రజలను కాపాడేందుకు అసవరమైన పరిష్కార మార్గాలు అన్వేషించాలని ఆదేశించింది.

వీధి కుక్కల దాడిలో జవహర్‌నగర్‌లో ఓ చిన్నారి చనిపోవడంపై హైకోర్టులో విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. మరోవైపు రోడ్లపై వ్యర్థాల వల్లే కుక్కల స్వైర విహారం ఎక్కువైందని హైకోర్టు వ్యాఖ్యానించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 3.8 లక్షల కుక్కలు ఉన్నాయని, వాటిని సంరక్షణ కేంద్రాలకు తరలించడం సాధ్యం కాదని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. రోడ్లపై వ్యర్థాలను నిర్మూలించి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అయితే కుక్కల నియంత్రణకు స్టెరిలైజ్‌ చేస్తున్నామని హైకోర్టుకు ఏజీ తెలపగా, స్టెరిలైజ్‌తో కుక్కల దాడులను ఎలా ఆపగలరని ఉన్నత న్యాయస్థానం ఏజీని ఎదురు ప్రశ్నించింది. కుక్కల దాడులను అరికట్టేందుకు రాష్ట్రస్థాయి కమిటీలను ఏర్పాటు చేసినట్లు కోర్టుకు ఏజీ తెలిపారు. జంతు సంరక్షణ కమిటీలతో ఈ కమిటీలు సమన్వయ పర్చుకొని కుక్కల దాడులకు పరిష్కారం చూపాలని హైకోర్టు సూచించింది. తదుపరి విచారణను వారం పాటు వాయిదా వేసింది హైకోర్టు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story