రైతుబంధు ఇప్పట్లో లేనట్లే అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తేల్చేశారు.

రైతుబంధు ఇప్పట్లో లేనట్లే అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తేల్చేశారు. సర్పంచ్ ఎన్నికలు ముగియడంతో ఇప్పుడే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు లేకపోవడంతో ఇప్పుడే రైతు బంధు వేసి వృధా అనే యోచనలో రేవంత్ ఉన్నట్లు తెలుస్తోంది. కేసీఆర్‌ హయాంలో డిసెంబర్ చివరి వారంలో రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాల్లో పడేవి. అయితే డిసెంబర్ చివరి వారంలో ఇచ్చే రైతు బంధు బంద్ కానున్నట్లు తెలుస్తోది. సాగు భూముల లెక్క తేలిన తరువాతే రైతు బంధు వేస్తామని తుమ్మల అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా యాసంగి పంట భూములను శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా గుర్తించి ఉపగ్రహ చిత్రాల క్రోడీకరణ ప్రక్రియ చేసి ఆ నివేదిక వచ్చిన తరువాతే రైతుబంధు ఇస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

Updated On
ehatv

ehatv

Next Story