పునరావాస కేంద్రం(rehabitation center) నుంచి పారిపోయిన ఇద్దరు బాలికలపై(Girls) ఐదుగురు యువకులు() అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది.

పునరావాస కేంద్రం(rehabitation center) నుంచి పారిపోయిన ఇద్దరు బాలికలపై(Girls) ఐదుగురు యువకులు() అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. జనగామ ప్రాంతానికి చెందిన బాలిక(14), మల్కాజిగిరికి(Malkajgiri) చెందిన బాలిక(15) ఇద్దరికీ తల్లిదండ్రులున్నా వేర్వేరు కారణాలతో వారిని పునరావాస కేంద్రంలో చేర్పించారు. బాలికల మధ్య స్నేహం పెరిగి పారిపోవాలని పథకం వేశారు. బాలికల్లో ఒకరు బస్టాండ్ సమీపాన పాన్​షాప్ నిర్వాహకుడు సాయిదీప్ దగ్గర ఫోన్ తీసుకుని తనకు పరిచయస్థుడైన నాగరాజుకు ఫోన్ చేసింది. అతడు వచ్చి, ఆశ్రయం కల్పిస్తానంటూ తీసుకెళ్లి అత్యాచారానికి(Rape) పాల్పడ్డాడు. బస్టాండు దగ్గరే మరో బాలిక ఒంటరిగా ఉండడాన్ని పాన్​షాప్ నిర్వాహకుడు సాయిదీప్ గమనించాడు. బాలికల విషయం తెలుసుకున్న సాయిదీప్ ఆశ్రయం కల్పిస్తానని పక్కనే ఉన్న బేకరీకి తీసుకెళ్లాడు.. బేకరీ నిర్వాహకుడు రాజు మరియు ఇతర స్నేహితులు అఖిల్, రోహిత్‌ హైదరాబాద్ తీసుకెళ్తామంటూ కారులో వేర్వేరు ప్రాంతాల్లో తిప్పుతూ లైంగిక దాడికి పాల్పడి తిరిగి బస్టాండ్ దగ్గర వదిలిపెట్టారు. బాలికలు తమపై లైంగిక దాడి జరిగిందని తెలిపారు. సైదాబాద్ పోలీసులు ఐదుగురు యువకులపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు

Updated On
Eha Tv

Eha Tv

Next Story