గద్వాలలో ఓ రోడ్డు ప్రమాదం రెండు నిరుపేద కుటుంబాన్ని చిదిమేసింది. ఇద్దరు విద్యార్థినుల తండ్రులు మంచాలకే పరిమితమయ్యారు.

గద్వాలలో ఓ రోడ్డు ప్రమాదం రెండు నిరుపేద కుటుంబాన్ని చిదిమేసింది. ఇద్దరు విద్యార్థినుల తండ్రులు మంచాలకే పరిమితమయ్యారు. ఒకరి తండ్రేమో కాళ్ల వాపుతో ఐదేళ్లుగా మంచంపై పడి ఉండగా.. మరొకరి తండ్రి రోడ్డు ప్రమాదంలో కాళ్లు పోగొట్టుకొని మూడేళ్లుగా మంచానికే పరిమితమయ్యారు. దీంతో వీరిని సాదే బాధ్యత తల్లులపై పడింది. కాయకష్టం చేసి ఇద్దరు విద్యార్థినులను చదివించుకుంటున్నారు. ఇంతటి కష్టంలోనూ ఆ నిరుపేద కుటుంబాలపై దేవుడు ఏమాత్రం కనికరం లేకుండా మరో పిడుగు వేశాడు. రోడ్డు ప్రమాద రూపంలో ఇద్దరు విద్యార్థులను కబళించి.. తల్లిదండ్రుల ఆశలను, విద్యార్థుల కలలను ఛిద్రం చేశాడు. వివరాల్లోకి వెళ్తే మాగనూరు మండలంలోని గురువలింగంపల్లి గ్రామానికి చెందిన గోసాయి మారెప్ప, మాణిక్యమ్మల దంపతులకు కుమారుడు రమేష్‌ గౌరి, మహేశ్వరి ఉన్నారు. అయితే ఐదేళ్ల క్రితం గోసాయి మారెప్ప కాళ్లవాపు వ్యాధితో మచ్చానికే పరిమితమయ్యాడు. దీంతో కుటుంబ పోషణ కోసం కుమారుడు రమేష్‌ దినసరి కూలి బాటపట్టగా.. తల్లి మాణిక్యమ్మ స్థానికంగా బిచ్చమెత్తుకుంటూ భర్తను చూసుకుంటుంది. కాగా.. ఇద్దరు కూతుళ్లు కష్టపడి చదివి బీఎస్సీ నర్సింగ్‌ ప్రభుత్వ సీట్లు సాధించారు. గౌరి(Gowri)కి వనపర్తి జిల్లాలో సీటు రాగా, మహేశ్వరి(Maheswari) (చివరి అమ్మాయి)కి గద్వాల జిల్లాలో ఉచిత సీటు వచ్చింది. మహేశ్వరి గద్వాల( Gadwal)లోని ఓ హాస్టల్‌లో ఉంటూ బీఎస్సీ నర్సింగ్‌ మూడో సంవత్సరం చదువుతోంది. పాన్‌గల్‌ మండలం రాయినిపల్లి గ్రామానికి చెందిన శ్రీదేవి(Sridevi), రాజుల(rajula) దంపతులకు కూతురు మనీష(Manisha), కుమారుడు మనోజుకుమార్‌(Manoj Kumar) ఉన్నారు. తండ్రి రాజు మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో కాళ్లు విరిగిపోవడంతో ఎలాంటి పనులు చేయలేని స్థితిలో మంచానికే పరిమితమయ్యా డు. దీంతో కుటుంబ భారమంతా తల్లి శ్రీదేవిపై పడింది. దీంతో ఆమె స్థానికంగా చిన్నపాటి కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తూ.. మనీషశ్రీని నర్సింగ్‌ చదివిస్తుంది. గద్వాలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈ ఇద్దరు విద్యార్థినులు మృత్యువాత పడడంతో వారి తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ ఏడ్వడంతో ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంగణమంతా విషాదంతో నిండుకుంది. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు విద్యార్థినుల కుటుంబాలను పరామర్శించారు.

ehatv

ehatv

Next Story