వినాయకుడి విగ్రహం తీసుకెళ్తుండగా హై టెన్షన్ వైర్లు తగిలి విద్యుత్ షాక్ తగిలి విషాదం చోటు చేసుకుంది.

వినాయకుడి విగ్రహం తీసుకెళ్తుండగా హై టెన్షన్ వైర్లు తగిలి విద్యుత్ షాక్ తగిలి విషాదం చోటు చేసుకుంది. రామంతాపూర్లో శ్రీకృష్ణాష్టమి వేడుకుల్లో విషాదం మరువకముందే బండ్లగూడలో మరో విషాద ఘటన చోటుచేసుకున్నది. వినాయక విగ్రహాన్ని తీసుకెళ్తుండగా విద్యుత్ షాక్‌తో ఇద్దరు యువకులు మృతిచెందారు. కొందరు యువకులు భారీ వినాయక విగ్రహాన్ని తీసుకెళ్తుండగా హై టెన్షన్ వైరు తగలడంతో ట్రాక్టర్‌కు విద్యుత్ షాక్ తగిలింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన అఖిల్ అనే యువకుడిని ఆస్పత్రికి తరలించారు. మృతులు టోని (21), వికాస్ (20)గా గుర్తించారు. కరెంటు షాక్తో ట్రాక్టర్ టైర్లు పూర్తిగా కాలిపోయాయి. దీంతో క్రేన్ సహాయంతో వినాయక విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

ehatv

ehatv

Next Story