అప్పుల బాధతో రాష్ట్రంలో మరో ఇద్దరు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు.

అప్పుల బాధతో రాష్ట్రంలో మరో ఇద్దరు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. మంత్రి సీతక్క (Minister Seethakka)సొంత జిల్లా ములుగు(Mulugu)లో వెంకటాపురం మండలం బెస్తగూడెం గ్రామానికి చెందిన రామెల్ల సతీశ్ (39) అనే రైతు, 3 ఎకరాల్లో మిర్చి పంట వేసి దిగుబడి రాక అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. జగిత్యాల జిల్లా వెల్దుర్తి గ్రామానికి చెందిన మతులాపురం రాజం(Mathalapuram Rajam) (55) గతంలో గల్ఫ్ దేశాలకు వలస వెళ్లి కేసీఆర్(KCR) ప్రభుత్వ వచ్చాక తిరిగి తెలంగాణకు వచ్చి తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. తనకున్న 25 గుంటలతో పాటు 8 ఎకరాలు కౌలుకు తీసుకొని పెట్టుబడి కోసం రూ.15 లక్షల అప్పు చేసి, అప్పు తీర్చే పరిస్థితి లేక మనస్తాపానికి గురయ్యి వ్యవసాయ క్షేత్రంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు

ehatv

ehatv

Next Story