సికింద్రాబాద్‌(Secunderabad) మోండా మార్కెట్(Monda Market) సమీపంలోని కుమ్మరిగూడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

సికింద్రాబాద్‌(Secunderabad) మోండా మార్కెట్(Monda Market) సమీపంలోని కుమ్మరిగూడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ముత్యాలమ్మ ఆలయంలోని(Temple) అమ్మవారి విగ్రహాన్ని(Godess idol) దుండగులు ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద పెట్టున అక్కడికి చేరుకున్నారు. ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఒకరిని అరెస్ట్‌ చేశారు. ఇదిలా ఉంటే విషయం తెలుసుకున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆలయాన్ని సందర్శించారు. పోలీసు ఉన్నతాధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే శ్రీగణేశ్‌ కూడా ఘటనాస్థలికి చేరుకుని స్థానికులతో మాట్లాడారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story