తెలంగాణ ఏర్పాటైన తర్వాత పోలీస్ శాఖలో ప్రవేశపెట్టిన పలు సంస్కరణలను తెలంగాణ కేడర్‌లోని ఎనిమిది మంది ఐఏఎస్ ప్రొబేషనర్లకు డీజీపీ(IAS Probationers) అంజనీ కుమార్(Anjani Kumar) సోమవారం సవివరంగా వివరించారు.

IAS Probationers
తెలంగాణ ఏర్పాటైన తర్వాత పోలీస్ శాఖలో ప్రవేశపెట్టిన పలు సంస్కరణలను తెలంగాణ కేడర్‌లోని ఎనిమిది మంది ఐఏఎస్ ప్రొబేషనర్లకు(IAS Probationers) డీజీపీ(DGP) అంజనీ కుమార్(Anjani Kumar) సోమవారం సవివరంగా వివరించారు. ఐఏఎస్ ప్రొబేషనర్ల ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమంలో భాగంగా డీజీపీ కార్యాలయానికి వచ్చిన వారితో ఆయన సంభాషించారు. పోలీసు శాఖలో సంస్కరణలతో పాటు ఇతర కార్యక్రమాలు, సంక్షేమ చర్యలపై అంజనీ కుమార్ చర్చించారు. ఎనిమిది మంది ఐఏఎస్ ప్రొబేషనర్లు రాధికా గుప్తా, డాక్టర్ పి శ్రీజ, ఫైజాన్ అహ్మద్, పి గౌతమి, పింకేష్ కుమార్, లెనిన్ వత్సల్ టోప్పో, శివేంద్ర ప్రతాప్, సంచిత్ గంగ్వార్ ఇంటరాక్షన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
