ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణంపై వీసీ సజ్జనార్(VC Sajjanar) కీలక ప్రకటన చేశారు.

ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణంపై వీసీ సజ్జనార్(VC Sajjanar) కీలక ప్రకటన చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఒరిజినల్ ఆధార్(Orginal Adhar), ఓటర్ ఐడీ(Voter Id), డ్రైవింగ్ లైసెన్స్(Driving Licence), తదితర గుర్తింపు కార్డులు ఉంటే మహిళలు కండక్టర్‌కు చూపించి జీరో టికెట్ పొందవచ్చని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. తెలంగాణ(Telangana)లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం మహాలక్ష్మి పథకం ( Mahalakshmi Scheme)కింద 2023 డిసెంబర్ 9 నుంచి అమలులో ఉంది. ఈ పథకం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు హామీలలో ఒకటి. దీనిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో ప్రారంభించారు. ఈ పథకం మహిళలు, బాలికలు, మరియు ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు రాష్ట్రంలోని తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ బస్సుల్లో(TSRTC) ఉచిత ప్రయాణాన్ని అందిస్తుంది.
