అక్కడున్న మగానుభావులు కాకులకేం కీడు తలపెట్టారో ఏమో కానీ, మగవాళ్లు చూస్తే చాలు వారి మీద పడి దాడులు చేస్తున్నాయి.

అక్కడున్న మగానుభావులు కాకులకేం కీడు తలపెట్టారో ఏమో కానీ, మగవాళ్లు చూస్తే చాలు వారి మీద పడి దాడులు చేస్తున్నాయి. తెలంగాణలోని సిరిసిల్ల(Sircilla) ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అదేమిటో కానీ పాత బస్టాండ్ సమీపంలోని కట్ట మైసమ్మ గుడి దగకగన ఉన్న భారీ వృక్షం పై ఉన్న కాకులు ఏరికోరి మగవాళ్లపైనే దాడికి దిగుతున్నాయి. పదుల సంఖ్యలో చెట్టుపైన ఉంటున్న కాకులు బస్టాండ్ నుంచి వచ్చి పోయేవారిలో మగవారిని చూసుకుని మరీ కాళ్లతో తంతున్నాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో(Social media) వైరల్‌ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు తలో విధంగా రియాక్టవుతున్నారు. మగజాతికి రక్షణ కరువయ్యిందని, కాకులు(Crow) కూడా మగవారిని తంతున్నాయని పాపం ఒకాయన రాసుకొచ్చారు. బహుశా అవి ఆడకాకులు అయి ఉంటాయని, అందుకే మగవారిపై పగబట్టి దాడులు చేస్తున్నాయిని ఒకరు కామెంట్‌ చేశారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story