కొన్ని రోజులుగా అఘోరీ(Lady Aghori) హల్‌చల్‌ చేస్తున్నది.

కొన్ని రోజులుగా అఘోరీ(Lady Aghori) హల్‌చల్‌ చేస్తున్నది. తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపుతున్నది. అప్పుడప్పుడు న్యూసెన్స్‌ కూడా చేస్తున్నది. ఇప్పుడామెపై వరంగల్‌ పోలీస్‌(Warangal Police) కమిషనరేట్ పరిధిలో మామూనరూరు పోలీసులు కేసు(Police case) పెట్టారు. కోడిని చంపినందుకు కేసు నమోదు చేశారు. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం! మామునూరు పోలీస్ స్టేషన్లో కోడిని చంపిన కేసు నమోదైంది. 325 BNS 11(1)(A) PCCA సెక్షన్లలో పోలీసులు అఘోరీపై కేసులు నమోదు చేశారు. నవంబర్ 19వ తేదీన అఘోరీ వరంగల్ నగర శివారులోని బెస్తం చెరువు స్మశాన వాటికలో(Graveyard) రెండు రోజులపాటు ఉండింది. అక్కడ స్మశాన వాటికలో క్షుద్ర పూజలు(Occult worship) నిర్వహించింది. బహిరంగంగా కోడిని బలి(Animal sacrifise) ఇచ్చింది. కోడిని చంపుతున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడంతో వాటిని చూసిన ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ క్రమంలో కరీంనగర్ జిల్లాకు చెందిన రోహన్ రెడ్డి అనే యువకుడు అఘోరీపై మామునూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బహిరంగంగా కోడిని బలివ్వడం, రక్త తర్పణ చేయడం నేరమని పోలీసులకు కంప్లయింట్‌ చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం అఘోరీ ఎక్కడ ఉందో ఇంకా పోలీసులు గుర్తించలేదు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story