ములుగు జిల్లా తాడ్వాయి మండలం లోని మేడారం(Medaram) మినీ జాతరను 2025 ఫిబ్రవరి 12వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు నిర్వహించాలని మేడారం పూజారులు నిర్ణయించారు.

ములుగు జిల్లా తాడ్వాయి మండలం లోని మేడారం(Medaram) మినీ జాతరను 2025 ఫిబ్రవరి 12వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు నిర్వహించాలని మేడారం పూజారులు నిర్ణయించారు. మేడారం జాతర రెండేళ్లకోసారి జరుగుతుంది. ఈ జాతరకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా అమ్మవార్ల దర్శనం కోసం వస్తారు. మేడారం జాతర జరిగిన ఏడాది తర్వాత చిన్న జాతరను నిర్వహిస్తారు. ఇది ఆనవాయతీగా వస్తోంది. ఈ రోజు సమావేశమైన పూజారులు తేదీలను ప్రకటించారు. జాతరకు సంబంధించిన ఏర్పాట్లను ప్రారంభించాలని రాష్ట్ర దేవాదాయ శాఖను మేడారం పూజారుల సంఘం కోరింది..

Updated On
Eha Tv

Eha Tv

Next Story