650 కోట్లు సమకూర్చిన నాయకుడు?

త్వరలో ఎన్నికలు(Election) జరగనున్న రాష్ట్రాలకు తెలంగాణ(Telangana) నుంచి నిధులు పంపుతున్నట్టు పక్కా సమాచారం ఉండడంతోనే ఈడీ అధికారులు(ED Officials) రంగంలోకి దిగినట్లు సమాచారం. కర్ణాటక తరహాలోనే ఇక్కడి నుంచి నిధుల తరలింపునకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. హవాలా(Hawala) రూపంలో హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రాలకు డబ్బులు తరలించినట్టు ఈడీ అధికారుల అనుమానం. ఇటీవల పార్లమెంట్ ఎన్నికల సమయంలో కర్ణాటక నుంచి హైదరాబాద్‌లోని కొన్ని బ్యాంకులకు నిధులు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే తరహాలో ఢిల్లీ అధిష్టానానికి ఇక్కడి కాంగ్రెస్(Congress) నాయకుడు రూ.650 కోట్లు సమకూర్చి పెట్టినట్టు సమాచారం ఉండడంతోనే ఈడీ సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది.

Updated On
Eha Tv

Eha Tv

Next Story