తన వివాదాస్పద వ్యాఖ్యలతో జీవితంలో మర్చిపోలేని మచ్చ తెచ్చుకున్న మంత్రి కొండా సురేఖపై(Konda surekha) అధిష్టానం కూడా గుర్రుగా ఉన్నట్లు సమాచారం.

తన వివాదాస్పద వ్యాఖ్యలతో జీవితంలో మర్చిపోలేని మచ్చ తెచ్చుకున్న మంత్రి కొండా సురేఖపై(Konda surekha) అధిష్టానం కూడా గుర్రుగా ఉన్నట్లు సమాచారం.

కొండా సురేఖ వ్యాఖ్యలను పలు జాతీయచానెళ్లలో ప్రసారం కావడంతో ఈ వ్యవహారం జాతీయస్థాయికి పాకింది. కొండా సురేఖ వ్యాఖ్యలను అన్ని పార్టీల నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. కేంద్రమంత్రులుసైతం సురేఖ వ్యాఖ్యలను తప్పుబట్టారు. దేశవ్యాప్తంగా ఉన్న సినీ ఇండస్ట్రీ కూడా సురేఖపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీంతో కొండా సురేఖ వ్యాఖ్యలను అధిష్టానం సునిశితంగా పరిశీలిస్తోంది. పలు రాష్ట్రాల్లో ఎన్నికల వేళ మంత్రి సురేఖ మాటలతో పార్టీకి నష్టం చేకూరే అవకాశం ఉన్న నేపథ్యంలో క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలు భావిస్తున్నారని సమాచారం. ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు కనీసం మంత్రిని నియంత్రణ చేయలేకపోయారని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలిసింది. కొండా సురేఖ మంత్రి పదవి నుంచి తప్పించి ఎమ్మెల్యేలు, మంత్రులు జాగ్రత్తగా మాట్లాడేలా వార్నింగ్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Updated On
Eha Tv

Eha Tv

Next Story