భర్తకు(Husband) దగ్గరుండి మరో పెళ్లి(Second Marriage) చేసిందో భార్య.

భర్తకు(Husband) దగ్గరుండి మరో పెళ్లి(Second Marriage) చేసిందో భార్య. తాను ఇష్టపడుతున్న యువతితో ఏడు అడుగులు వేయించింది. మహబూబాబాద్‌(Mahabubabad) జిల్లా కేంద్రంలోని భక్త మార్కండేయ దేవాలయంలో ఈ పెళ్లి జరిగింది. చిన్నగూడురు మండలం ఉగ్గంపల్లి గ్రామానికి చెందిన దాసరి సురేశ్‌, సరితలకు కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. ఈ దంపతులకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు. జిల్లా కేంద్రంలోని భక్తమార్కండేయ గుడి వీధికి చెందిన లాకా పద్మ, వీరస్వామి దంపతుల చిన్న కూతరు సంధ్య వరుసకు సురేశ్‌కు మరదలు అవుతుంది. సంధ్య మానసిక దివ్యాంగురాలు. సంధ్యను తాను ఇష్టపడుతున్నానని సురేశ్‌ తన భార్య సరితకు చెప్పాడు. ఆమె కోపగించుకోకుండా భర్త మనసునెరిగి రెండో వివాహానికి ఒప్పుకుంది. బుధవారం ఇరువర్గాల పెద్దలు, భార్య సరిత సమక్షంలో పట్టణంలోని భక్త మార్కండేయ ఆలయంలో పెళ్లి జరిపించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. జిల్లా కేంద్రంలో పెళ్లి గురించే చర్చ జరుగుతోంది. దీనిపై సరితను వివరణ కోరగా సంధ్యను తన భర్త సురేశ్‌ ఇష్టపడ్డాడని, సంధ్య మానసిక దివ్యాంగురాలు అన్నారు. పిల్లల మనసత్వం కలదని, తన పిల్లల మాదిరిగానే చూసుకుంటానని చెప్పింది. ఇదిలా ఉంటే పెళ్లి జరగక ముందు పెద్ద డ్రామా జరిగింది. సంధ్య సోదరి భర్త నాగరాజు ఉదయం 11 గంటలకు 100 డయల్‌కు కాల్‌ చేశారు. తన మరదలు మానసిక దివ్యాంగురాలు అయితే కావచ్చు కానీ, రెండో పెళ్లి చేయడం నేరమని గొడవకు దిగారు. బ్లూ కోర్టు సిబ్బంది పెళ్లి జరుగుతున్న ఆలయానికి వచ్చి ఆధార్‌ కార్డు పరిశీలించారు. పెళ్లి కూతురు మేజరని, ఇద్దరు ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకుంటున్నారని తెలిపారు. నాగరాజును మందలించి అక్కడి నుంచి పంపించారు. రెండో వివాహాన్ని పోలీసులే ప్రోత్సహించారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.



Updated On
Eha Tv

Eha Tv

Next Story