యాదాద్రి యాదగిరిగుట్ట దేవస్థానం సీనియర్ ఇంజనీర్ (S.E) ఉడేపు రామారావును లంచం కేసులో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.

యాదాద్రి యాదగిరిగుట్ట దేవస్థానం సీనియర్ ఇంజనీర్ (S.E) ఉడేపు రామారావును లంచం కేసులో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్ నుండి రూ.1.90 లక్షల లంచం స్వీకరిస్తుండగా హైద్రాబాద్‌లోని ఉప్పల్‌లో దుకాణంలో ఆయనను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. విచారణ నిమిత్తం రామారావును యాదగిరిగుట్టకు తీసుకువెళ్లిన ఏసీబీ అధికారులు, ఆయనకు చెందిన పలు ఆస్తులు, అలాగే బంధువుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. ఇదివరకే రామారావుపై అనేక ఆరోపణలు ఉన్నాయని, పలుమార్లు కేసులు నమోదు అయ్యాయని సమాచారం. ప్రస్తుతం సిటీ సివిల్ కోర్టులో కొందరిని మోసం చేశారన్న సివిల్ కేసు కూడా నడుస్తోంది. వందల ఎకరాల భూములను బంధుమిత్రుల పేర్లపై సమకూర్చారనే ఆరోపణలు కూడా యాదగిరిగుట్ట స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి.

Updated On
ehatv

ehatv

Next Story