YNR Analysis: పడిపోతున్న తెలంగాణ ఆదాయం.. డబ్బంతా ఏం చేస్తున్నారు.. 'YNR' విశ్లేషణ..!

తెలంగాణకు సంబంధించిన ఆదాయం పడిపోతుంది. తెలంగాణ ఆదాయం గణనీయంగా పడిపోతున్నట్లుగా కాగ్‌ రిపోర్ట్ చెప్తోంది. మొదటి క్వార్టర్ కు సంబంధించి కాగ్‌ చేసిన కామెంట్ చూస్తే, తెలంగాణ ఆదాయం పరిస్థితి కాస్త ఆందోళన కలిగిస్తుంది, కాగ్‌ రిపోర్ట్ చెప్పిన దాని ప్రకారం మొదటి మూడు నెలల్లో రాష్ట్రానికి సంబంధించిన ఆదాయం రెవెన్యూ లోటు 10వేల కోట్ల రూపాయలకు పైగా ఉంది. 10,583 కోట్ల రూపాయల రెవెన్యూ లోటు కనబడుతుంది, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి దాంతో పాటు ఈ మూడు నెలల్లోనే రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు 20,266 కోట్లుగా ఉంది. ఓ పక్క అప్పుల సంఖ్య గణనీయంగా పెరిగింది, మరోవైపు రెవెన్యూ లోటు కూడా భారీగా కనపడుతోంది. నిజానికి ఈ ఏడాది 2000 కోట్ల రూపాయలకు పైగా లాభాల్లో ఉంటాం, అడిషనల్ గా ఇన్కమ్ ఉంటుంది అంటూ బడ్జెట్ చెప్పింది. ఏప్రిల్ నుంచి ఈ మూడు నెలల్లో చూస్తే అదనపు బడ్జెట్ విషయం పక్కన పెడితే, రెవెన్యూ లోటు కనపడుతుంది. రెవెన్యూ లోటు ఆందోళన కలిగిస్తుంది. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మొత్తం బారోయింగ్ కి సంబంధించిన లిమిట్ లో 37% ని మొదటి మూడు నెలల్లోనే వాడేసుకున్నారు. సో మిగతా తొమ్మిది నెలల పాటు రిమైనింగ్ బారోయింగ్ కి సంబంధించిన లిమిట్ ని యూటిలైజ్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. మొదటి మూడు నెలల్లోనే 37 శాతనికి పైగా అప్పులను తీసుకొచ్చేశారు, 20 వేల కోట్ల రూపాయల అప్పులు చేసి కొత్తగా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు ఏమి అమలు చేయకుండా, ఉన్న సంక్షేమ కార్యక్రమాలను కూడా పక్కన పెట్టేసి, మరోవైపు రెవెన్యూ లోటు కూడా చూపిస్తున్నారంటే, ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే, ఆందోళన కలుగుతోంది. తెలంగాణ రాష్ట్ర ఆదాయం వృద్ధి కేవలం 3 శాతానికి పైగా మాత్రమే ఉంది, గతంతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ, రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ సర్కారు రాష్ట్రాన్ని తిరోగమనం దిశలో తీసుకెళ్తుంది అంటూ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. కాగ్‌ నివేదిక నేపథ్యంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వం పైన విమర్శల వర్షం కురిపిస్తున్నారు, సో కాగ్‌ రిపోర్ట్ చెప్తున్న దాని ప్రకారం ఆదాయం తగ్గుదల కనపడుతుంది, ఆదాయం పెరుగుదలలో పర్సంటేజ్ ఆఫ్ గ్రోత్ చాలా తక్కువగా కనబడుతుంది. దాంతో పాటు అప్పులు గణనీయంగా చేయడం కనపడుతుంది, దాంతో పాటు రెవెన్యూ లోటు కూడా కనబడుతుంది. సో ఈ మూడు కూడా ఖచ్చితంగా ఆందోళన కలిగించే అంశాలే, ఇది ఒక పొలిటికల్ పార్టీ చేస్తున్న విమర్శక కంటే కూడా కాగః రిపోర్ట్ ఏ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాల పైన, పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు విమర్శలు కారణం అవుతుంటుందో చాలా సందర్భాల్లో చూస్తుంటాం. ఈ అంశంపై సీనియర్‌ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..

Updated On 13 Aug 2025 9:49 AM GMT
ehatv

ehatv

Next Story